
కొండపి: పొన్నలూరు మండలం, ముప్పాళ్ళ గ్రామంలోని ఎస్.సి కాలనీలో శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం భూమి పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరిపారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భక్తి వాతావరణంలో ఆలయ నిర్మాణ పనులకు శుభారంభం జరిగింది. గ్రామాభివృద్ధికి ఈ దేవస్థానం కీలకంగా మారుతుందని అధికారులు, గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.