మార్కాపురం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లో జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను స్పష్టంగా అర్జీల రూపంలో రాసుకొని సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు.

జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.