
అమలాపురం: కోనసీమ జిల్లాలో రెండవ విడత జర్నలిస్టుల అక్రెడిటేషన్ గుర్తింపు కార్డుల జారీకి సంబంధించిన చర్యలు ప్రారంభించబడినట్లు జిల్లా సమాచార & పౌర సంబంధాల అధికారి, అమలాపురం తెలియజేశారు.
ఈ సందర్భంగా అక్రెడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయదలచిన పాత్రికేయులు ఏప్రిల్ 24వ తేదీ లోగా తమ ఆన్‌లైన్ దరఖాస్తులను పూర్తి చేయాలని సూచించారు. అనంతరం వాటి హార్డ్ కాపీలను తీసుకుని సంతకం చేసి సంబంధిత కార్యాలయంలో సమర్పించాల్సిందిగా కోరారు.
గడువులోగా దరఖాస్తులను సమర్పించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.