
గుంటూరు ఏసిబి డీఎస్పీగా నూతనంగా నియమితులైన ఆళహరి శ్రీనివాసరావును జనసేన పార్టీ నేతలు ఈరోజు ఉదయం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, పట్టణ కార్యదర్శి కలగంటి త్రిపురా కుమార్, 19వ డివిజన్ ఉపాధ్యక్షుడు ఉప్పు వెంకట్, డివిజన్ కార్యదర్శులు తోట పవన్ కుమార్, గట్టుమళ్ళ బద్రి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బండి రామ్ ప్రభు, డేగల వెంకటేశ్వరరావు, వీర మహిళా నాయకురాలు రామిశెట్టి ధరణి నాయుడు, చిరంజీవి ఫ్యాన్ సీనియర్ నాయకుడు మంత్రి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీకి శుభాకాంక్షలు తెలియజేశారు.