రేఖపల్లిలో ఎంజీఎన్ఆర్జీఎస్ సామాజిక తనిఖీ ప్రజా వేదిక

రామచంద్రవరం: వి.ఆర్.పురం మండల కేంద్రం రేఖపల్లి గ్రామంలో ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) సామాజిక తనిఖీపై ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు.

జడ్పిటిసి గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ, పాడేరు విజిలెన్స్ సెక్షన్ సిబ్బంది, ఏవో, ఎస్ఆర్పీ సామాజిక విభాగానికి చెందిన ఆర్. వెంకటరావు, ఎస్.ఆర్.పి అచ్చుత్, వెంకటేశ్వరరావు, ఎస్. శ్రీకాంత్, ఏపీఓ రెడ్డిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజావేదికలో వచ్చిన అంశాలపై చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 782 పనులకు గాను సుమారు 11 కోట్ల రూపాయల వ్యయ వివరాలను ప్రజల ముందు చదివి వినిపించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధి సిబ్బంది, గ్రామ ఉపాధి శ్రామికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.