
రామగుండం ఎన్.పి.టి.సిలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర యువజన విభాగం అడక్ కమిటీ సభ్యుడు మంథని శ్రావణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్.పి.టి.సిలోని అంబేద్కర్ విగ్రహానికి మంథని శ్రావణ్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడని కొనియాడారు. ప్రతి యువకుడు ఆయన ఆశయ సాధనలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని తెలిపారు.
“అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి మాత్రమే చెందినవారు కాదు, దేశం గర్వించదగ్గ మేధావి. చదువుతోనే సాధికారత సాధ్యమని ఆయన నమ్మకం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వీర మహిళ కానుగంటి మంగ, జనసేన పార్టీ నాయకులు మార్క ఆశ్రిత్ గౌడ్, బషీర్, గట్ల వెంకన్న, సుధాకర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.