రాజంపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

రాజంపేట: అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా గౌరవంగా జరుపుకుంటూ, సమానత్వం, న్యాయం, విద్యపై ఆయన అందించిన అమూల్యమైన సందేశాలను స్మరించుకునే ఈ సందర్భంగా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్)లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.

రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు సూచన మేరకు, యల్లటూరు శివరామరాజు ఆధ్వర్యంలో భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశానికి సామాజిక న్యాయం, సమానత్వం అనే విలువలను బలపరిచిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. భారత రాజ్యాంగ రూపకర్తగా దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసిన దార్శనికుడు అని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు ప్రతి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, సమాజ అభివృద్ధికి ఆయన సిద్ధాంతాలు ఎంతో అవసరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సమ్మెట శివ ప్రసాద్, మాజీ ఎంపీటీసీ మాడపూరి శ్రీరాములు, మాడపూడి బాల, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మండెం అబూబకర్, జనసేన నాయకులు కొండూరు విజయ నరసింహారాజు, నరసింహరాజు, డి. సుబ్బరామరాజు, లక్ష్మీపతి రాజు, పి.వి. సుబ్బరాజు, వినోద్ వర్మ, నారదాసు రామచంద్ర, నారా బోయిన ప్రసాద్, పత్తి నారాయణ, మధుసూదన్, ప్రతాప్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.