అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం: వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం: గుంతకల్ పట్టణంలోని బెంచికొట్టాల వద్ద అంబేద్కర్ యువజన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వాసగిరి మణికంఠ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ, అంబేద్కర్ తన అసాధారణ ప్రతిభతో భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి, దేశంలో ప్రజాస్వామ్యం బలపడేందుకు పునాదులు వేశారని పేర్కొన్నారు. అనగారిన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి అజరామరమని కొనియాడారు.

అంబేద్కర్ స్ఫూర్తి, ఆయన చూపిన మార్గాన్ని ప్రతి భారతీయుడు అనుసరించాలని, రాజ్యాంగం ఇచ్చిన విలువలను కాపాడితేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని తెలిపారు. స్వాతంత్ర్యం కోసం పూర్వీకులు చేసిన త్యాగాలను గుర్తుంచుకొని, ఆ స్పూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిదని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, పవర్ శేఖర్, పాండు కుమార్, పామయ్య, ధనుంజయ, శేఖర్, రమేష్ రాజ్, గాజుల రఘు, సుబ్బయ్య, ఆటో రామకృష్ణ, అమర్నాథ్, సూరి, అంజి, రామకృష్ణ, మైనారిటీ నాయకుడు దాదు, మధు, అలాగే అంబేద్కర్ యువజన సేవా సమితి సభ్యులు మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.