నీటి భద్రతపై 100 రోజుల కార్యక్రమం ప్రారంభం

తాడిపత్రి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 6 ఏప్రిల్ 2026న అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో “నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” 100 రోజుల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఉపముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు, కాకినాడ ఎంపీ తదితర ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 6 నుండి జులై 15, 2026 వరకు రాష్ట్రవ్యాప్తంగా చెరువులను పునరుద్ధరించడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, సమీప నీటి వనరులతో అనుసంధానం, కాలువల ద్వారా సాగునీటి సరఫరా మెరుగుపరచడం, డ్రైన్‌లను శుభ్రపరచడం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, ఫీడర్ ఛానల్స్ శుభ్రపరచడం, భూగర్భ జలాల పెంపు, పచ్చదనం పెంపు లక్ష్యంతో చేపడుతున్నారు. కార్యక్రమం నాలుగు దశల్లో జరుగుతుంది.

పనుల గుర్తింపు/కార్యాచరణ ప్రణాళిక, నిధుల మంజూరు, పనుల అమలు, రిపోర్టింగ్&డాక్యుమెంటేషన్. డీసీసీబీ, డెల్టా ప్రాజెక్ట్, ఏఎంసి, పిఠాపురం వైస్ చైర్మన్లు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, నీటి సంఘాల అధ్యక్షులు, జనసేన, టీడీపీ నాయకులు, రైతులు మరియు మీడియా ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా చెరువుల సామర్థ్యాన్ని పెంచి సాగునీటి సమస్యలను పరిష్కరించడం, రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రతను పెంపొందించడం లక్ష్యం.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.