పన్నుల వసూళ్లలో ముందంజలో అమలాపురం – కమిషనర్‌కు అభినందనలు

అమలాపురం: కోనసీమ జిల్లాలోని అమలాపురం మున్సిపాలిటీ పన్నుల వసూళ్లలో జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయానికి కృషి చేసిన మున్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్‌ను క్లాస్ 1 కాంట్రాక్టర్ అల్లాడ వెంకట రమణ అభినందించారు.

మున్సిపల్ పరిపాలనలో సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం వల్లే ఈ స్థాయి సాధ్యమైందని ఆయన ప్రశంసించారు. పన్నుల వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా మున్సిపాలిటీ అభివృద్ధికి బాటలు పడతాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ నాయకత్వం, కృషి, పారదర్శకతపై ప్రశంసలు కురిపిస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.