ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంతోషిస్తున్న క్షణాలివి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్ సభ ఆమోదం పొందటంతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంతో ఉన్నారని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆనందం వ్యక్తం చేశారు. వారంతా గర్వించే క్షణాలివి. ఈ చట్టబద్ధతతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుంది. లోక్ సభలో ఈ బిల్లుకు మద్దతు తెలియచేసిన పక్షాలకు, ఎంపీలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అమరావతికి చట్టబద్ధత అభించడాన్ని జీర్ణించుకోలేక విషం చిమ్ముతున్నవారికి రాబోయే రోజుల్లో ప్రజలు మరింత బలమైన పాఠం నేర్పిస్తారు. రాజధాని అమరావతికి తోడ్పాటును అందిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, గౌరవ కేంద్ర హోంశాఖామాత్యులు శ్రీ అమిత్ షా గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవంతో అమరావతి ప్రజా రాజధానికి, భావితరాల అభివృద్ధికి కేంద్రంగా నిలుస్తుందనే విశ్వాసం ఉందని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.