
ఉగాది పర్వదినాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు తీయటి కబురు చెప్పింది మా కూటమి ప్రభుత్వం. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్దేశిత సమయంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను మనసుతో అర్థం చేసుకుంటోంది. ఈ 20 నెలల కాలంలో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము. ఉపాధ్యాయ, కానిస్టేబుల్ పోస్టులకి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించినప్పుడు యువత కళ్లలో ఆనందం చూశాము. ఈ ఏడాది ఇచ్చే నోటిఫికేషన్ల ద్వారా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాము. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంజనీరింగ్, టీచింగ్, యూనిఫాం సర్వీసెస్ పోస్టులను భర్తీ చేయనున్నాము. ఇక ఉద్యోగార్థులు ప్రిపరేషన్ లో నిమగ్నం కావాలని కోరుకుంటున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.