
సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేసిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు శ్రీ బిల్ గేట్స్ గారికి రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో సమావేశంలో పాల్గొన్నారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో విద్యా వైద్య వ్యవసాయ రంగాల్లో సహకారం అందించేందుకు ముందుకు వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.