జనసేన నాయకులు గురాన అయ్యలు జన్మదిన వేడుకలను జనసేన నాయకులు,
అభిమానులు బుధవారం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పలు దేవాలయాల్లో ప్రత్యేక
పూజలు నిర్వహించారు. వేడుకలలో భాగంగా జొన్నగుడ్డిలో మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య
శిబిరం, పుష్పగిరి ఆసుపత్రి సౌజన్యంతో కంటివైద్య శిబిరం నిర్వహించారు. పెద్ద ఎత్తున పేదలు వైద్య సేవలను
వినియోగించుకున్నారు. వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం వెలుగు ఆశ్రమం, పినవేమలి
ఆశ్రమం, నిరాశ్రయుల వసతిగృహం, పలు దేవాలయాల్లో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అలాగే పలుచోట్ల
చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. అలాగే న్యూలైఫ్ బ్లడ్ బ్యాంకులో యువత పెద్ద ఎత్తున రక్తదానం
చేశారు. అనంతరం జిఎస్ఆర్ టల్లో అభిమానులు సమక్షంలో బర్త్‌డే కేక్‌ను కట్‌చేసి వేడుకలు జరుపుకున్నారు.
జిల్లాలోని జనసేన నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలతో అయ్యలుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ
సందర్భంగా గురాన అయ్యలు విూడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను స్ఫూర్తిగా తీసుకుని
తన జన్మదినం రోజున అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
జిల్లాలో జనసేన బలోపేతానికి శక్తివంచన లేకుండా కరిషి చేస్తానన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న
సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పార్టీ పెద్దల సహకారంతో కరిషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద
ఎత్తున జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.