కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండడం
వారి కన్నీరు తుడవడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యం
ఓటు బ్యాంకు రాజకీయం మాకొద్దు
సేవా రాజకీయమే ముద్దు
తద్వారా శాశ్వత రాజ్యాధికార స్థాపనే ధ్యేయం
ప్రజలకు అంతిమ అధికారం అందించడమే జనసేన లక్ష్యం
జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, కేఎం పురం
గ్రామపంచాయతీ, కేఎం పురం ఏ ఏ డబ్ల్యు గజేంద్ర కు జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న
వీల్ చైర్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నడవలేని వ్యక్తి గజేంద్రకు వీల్
చైర్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ పూర్ణ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండి, వారి కన్నీరు తుడవడమే జనసేన పార్టీ
ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయం మాకొద్దు, సేవా రాజకీయమే ముద్దు అని తెలియజేసారు. తద్వారా శాశ్వత రాజ్యాధికార స్థాపనే ధ్యేయం అని ధీమా వ్యక్తం
చేసారు. ప్రజలకు అంతిమ అధికారం అందించడమే జనసేన లక్ష్యమని తెలిపారు. ఒకసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వండి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా చేస్తామని,
నియోజకవర్గంలో వాడ వాడల అభివృద్ధి చేస్తామని, ఇదివరకు ఎవరు చేయని చేయలేని బృహత్తరమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో
గుర్తించిన సమస్యలపై పరిష్కారం దొరికేంతవరకు అవిశ్రామ కృషి చేయడానికి జనసేన పార్టీసిద్ధంగా ఉందని, బాదిత కుటుంబాలకు జనసేన ఎల్లప్పుడు అండగా ఉంటుందని, ప్రజా
సమస్యలపై పోరాడుతూ, ఆ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కూడా వీరోచితమైన పోరాటం చేయడానికి జనసేన సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నిటిని
పరిష్కరించేంత వరకు మీకు జనసేన అండదండలు ఎల్లప్పుడూ ఉంటుందని గ్రామస్తులకు తెలిపారు. ఎప్పటికప్పుడు మండల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యకు
శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, సురేష్ రెడ్డి, సెల్వి, ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, మండల
కార్యదర్శులు మధు, నవీన్, వినోద్, మోహన్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, టౌన్ కమిటీ కార్యదర్శి మీనా, గ్రామస్తులు పాల్గొన్నారు.