
శేరిలింగంపల్లి: జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ డా. మాధవరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్లో చలివేంద్ర కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ నాయకులు కేశవ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ప్రవీణ్ సాహు, హరినాయక్, నవీన్, మాధవరావు సుధాకర్, శివ కుమార్, రమేష్ రెడ్డి, భద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే వీర మహిళలు పుష్పలత, ఇందుమతి, మరియు జనసైనికులు మూర్తి రాజు, ప్రసాద్, రమేష్, వెంకటేష్, శివ, రిషికేశ్, జీవన్, విజయ్, నితీష్‌తో పాటు కాలనీ పెద్దలు కూడా హాజరయ్యారు.
ప్రజా సేవా కార్యక్రమాల ద్వారా జనసేన నాయకులు సమాజానికి చేరువవుతున్నారని ఈ సందర్భంగా స్థానికులు అభిప్రాయపడ్డారు.