అభివృద్ధి పనుల పురోగతిపై చర్చ

రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ భేటీలో నిడదవోలు నియోజకవర్గ పరిధిలో పల్లెపండుగ, అమరజీవి జలధార కార్యక్రమాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా నిడదవోలు అభివృద్ధికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్న సహకారానికి శ్రీ దుర్గేష్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.