నాదెండ్ల భాస్కర్ రావు మరణంపై సంతాపం

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన పార్టీ జిల్లా నాయకుడు పాలగిరి చరణ్ తేజ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లోని నాదెండ్ల మనోహర్ నివాసానికి వెళ్లి భాస్కర్ రావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారిని పరామర్శించారు.

భాస్కర్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.