ఆహార కేంద్రం ద్వారా నిరుపేదల ఆకలి తీరుస్తున్న మీకై.. మేము

సాలూరు: సాలూరు పట్టణంలో ‘మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ గత ఆరు సంవత్సరాలుగా నిరుపేదల ఆకలి తీర్చే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 2020లో పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ ఆహార కేంద్రం నేడు ఎంతోమందికి ఆధారంగా నిలుస్తోంది.

ఈ సంస్థ ద్వారా పుట్టినరోజులు, పెళ్లిరోజు వేడుకలు, కళ్యాణ మండపాల కార్యక్రమాలు, వీధి కార్యక్రమాల్లో మిగిలిన ఆహారాన్ని సేకరించి ఫుడ్ బ్యాంక్ ద్వారా అవసరమైన పేదలకు పంపిణీ చేస్తున్నారు. దీంతో ఆహారం వృథా కాకుండా అవసరమైన వారికి చేరుతోంది.

అలాగే నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, అవసరమైన వారికి ఇంటి వద్దకే వెళ్లి ఆహారం అందించడం కూడా ఈ సంస్థ ప్రత్యేకతగా కొనసాగుతోంది. తమ సేవల ద్వారా సమాజంలో ఆకలిని తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సంస్థ సభ్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.