
రాజోలు: రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం కేశనపల్లి గ్రామంలో ప్రతిపాదిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పీహెచ్సీ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.