
న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ శ్రీ కన్నబాబు (ఐఏఎస్), భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి అనీస్ జోసెఫ్ మధ్య రాష్ట్రవ్యాప్తంగా 1,000 “మీ మార్ట్స్” ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
ఈ కార్యక్రమాన్ని తొలి దశలో పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉన్న ఫెయిర్ ప్రైస్ షాపులు (రేషన్ దుకాణాలు) ద్వారా ప్రజలకు సుమారు 70 రకాల నాణ్యత హామీ కలిగిన వినియోగ వస్తువులను పోటీ ధరలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఒకే చోట నాణ్యమైన నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందించడంతో పాటు, ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు.