కొప్పర్రులో ట్రాన్స్‌ఫార్మర్ సమస్య పరిష్కారం – ప్రజల మన్ననలు పొందిన అందే నరేన్ గారు

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పరిధిలోని కొప్పర్రు 8వ వార్డులో సంవత్సరాలుగా కొనసాగుతున్న ట్రాన్స్‌ఫార్మర్ సమస్యకు చివరికి పరిష్కారం లభించింది. జనసేన పార్టీ సెక్యూరిటీ కోఆర్డినేటర్, పీఏసీఎస్ చైర్మన్ అందే నరేన్ గారు చొరవతో ఈ సమస్యను విజయవంతంగా పరిష్కరించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువత ఆయన సేవా భావాన్ని ప్రశంసించారు. ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం రాకపోయినా, అందే నరేన్ గారు బాధ్యతతో ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.

“జనం కోసం ఒకటి అనుకునే నాయకుడు”గా నిలిచిన అందే నరేన్ గారు, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనులను దగ్గరుండి పర్యవేక్షించి పూర్తి చేయించారు. దీతో స్థానిక ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులకు పెద్ద ఊరట లభించింది.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, యువత మరియు మహిళలు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన సేవా భావం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.