
అమలాపురం నియోజకవర్గం: అమలాపురం పట్టణంలోని మహిపాల వీధిలో పెళ్లిళ్ల వెంకన్నగా ప్రసిద్ధిగాంచిన భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1,200 మంది మహిళలు పాల్గొని వరలక్ష్మీ అమ్మవారిని భక్తిపూర్వకంగా పూజించారు.
వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి సన్నిధిలో సామూహికంగా వ్రతాలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
పూజలో పాల్గొన్న ప్రతి మహిళకు ఆలయ సిబ్బంది గాజులు, జాకెట్ ముక్కతో పాటు వరలక్ష్మీ దేవి ప్రతిమను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కంచిపల్లి అబ్బులు, ఈవో పీవీ సత్యకుమార్, ఆలయ కమిటీ సభ్యులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.