
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా కొణిదెల నాగబాబు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నందిగామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పి.ఏ.సీ.ఎస్.) చైర్మన్ కొట్టె హరికృష్ణ (బద్రి) మంగళగిరి అరణ్య భవన్లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
అనంతరం హరికృష్ణ (బద్రి) మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, అటవీ సంరక్షణతో పాటు ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన అంశాల్లో గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో మరింత సమర్థవంతమైన కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
నాగబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ మరింత అభివృద్ధి సాధించి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆయన కోరారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ సంరక్షణకు సంస్థ మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు