ఐఎఫ్‌డబ్ల్యూజే ఉమ్మడి తూర్పు కన్వీనర్ గా జి ఎన్ రావు

అమలాపురం: ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్‌గా జి.ఎన్. రావు నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు పి. రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి డి. నరేంద్ర సాయి ఆయనకు నియామక పత్రాలను అందజేశారు.

తనకు ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు పి. రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి డి. నరేంద్ర సాయికి జి.ఎన్. రావు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఐఎఫ్‌డబ్ల్యూజేను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలు ఉన్నాయని తెలిపారు. త్వరలో ఆయా జిల్లాలకు కన్వీనర్లను నియమించి, అనంతరం జిల్లా స్థాయి, డివిజన్ స్థాయిలో పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని జి.ఎన్. రావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.