రూ.7 కోట్లతో నిడదవోలుకు పుష్కర శోభ: పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు : రూ.7 కోట్లతో నిడదవోలుకు పుష్కర శోభ: పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలులో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్ చినకాశీరేవును ఆధ్యాత్మిక కేంద్రంగా, నిడదవోలును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వెల్లడి నిడదవోలులో రూ.3.69 కోట్లతో ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టు పనులు శరవేగం..డిసెంబర్ నాటికి పనుల పూర్తికి చర్యలు సెప్టెంబర్ 6 నుండి నిడదవోలులో ఎల్‌టీటీ (LTT) ఎక్స్‌ప్రెస్ హాల్ట్..మోడల్ జంక్షన్‌గా నిడదవోలు రైల్వే స్టేషన్.. కేంద్ర, రాష్ట్రాల సహకారంతో కల్పించిన అధునాతన సదుపాయాలు పరిశీలించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు:మునుపెన్నడూ లేని విధంగా నిడదవోలు పట్టణ రూపురేఖలను మారుస్తున్నామని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కనెక్టివిటీ రోడ్లు నిర్మిస్తూ పుష్కరాల నాటికి నిడదవోలును సుందర నందనవనంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.సోమవారం నిడదవోలు పట్టణంలోని చినకాశీరేవు, బాసివిరెడ్డిపేట ప్రాంతాలలో గోదావరి పుష్కరాలు-2027 పనుల కింద పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అదే విధంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా పర్యాటక శాఖ ద్వారా జరుగుతున్న పనులను స్వయంగా పర్యవేక్షించారు. తొలుత గోదావరి పుష్కరాలు-2027 ప్రత్యేక గ్రాంట్ రూ. 35 లక్షల వ్యయంతో 2వ మరియు 3వ వార్డులలో అన్నపూర్ణ నగర్ నుండి చినకాశీరేవు వరకు 730 మీటర్ల పొడవునా మెటల్ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.9 పోల్స్‌తో కూడిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవ ఫలకాన్ని మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. ప్రస్తుతం మట్టిరోడ్డుగా ఉన్న దీనిని మెటల్ రోడ్డుగా మార్చడం ద్వారా చినకాశీరేవు, హిందూ శ్మశానవాటికకు రాకపోకలు సులువవుతాయని, అమృత్ 2.0 కింద పట్టణానికి తాగునీరు అందించే నీటిసేకరణ బావి నిర్మాణానికి మరియు పుష్కర భక్తులకు ఇది ప్రధాన అనుసంధాన రహదారిగా ఉపకరిస్తుంది అని పేర్కొన్నారు. అనంతరం 11వ వార్డులోని రైల్వే స్టేషన్ రోడ్డులో రూ. 1.34 కోట్ల వ్యయంతో నిర్మించిన 265 మీటర్ల సీసీ రోడ్డు, 500 మీటర్ల డ్రెయిన్ మరియు 9 పోల్స్‌తో కూడిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవ ఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు.రైలు మార్గం ద్వారా నిడదవోలు జంక్షన్‌కు చేరుకునే పుష్కర భక్తులకు, చినకాశీరేవు ఘాట్‌కు వెళ్లే యాత్రికులకు మరియు రాజమహేంద్రవరం వైపు నుండి వచ్చేవారికి ఈ డివైడర్ రోడ్డు మరియు లైటింగ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత వివిధ శాఖల అధికారులతో కలిసి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చినకాశీరేవులోని శివాలయాన్ని సందర్శించారు. త్వరలోనే నిధులు సమకూర్చి సంబంధిత ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… 2027 గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు అత్యుత్తమ మౌలిక వసతులు కల్పించేందుకు రూ. 7 కోట్లతో ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని వెల్లడించారు. అందులో భాగంగా రూ. 2.50 కోట్ల వ్యయంతో నిడదవోలులోని 11 ప్రధాన ఘాట్లను ఆధునికీకరించి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు.రూ.1.45 కోట్ల అంచనాతో ప్రధాన రహదారులు, అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులు , రూ. 20 లక్షలతో భక్తుల వాహనాల నిలిపివేతకై 6 విశాలమైన పార్కింగ్ ఏరియాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ. 1 కోటి వ్యయంతో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పనుల్లో భాగంగా 34 టాయిలెట్ల నిర్మాణం, రూ. 90 లక్షలతో సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు, రూ. 50 లక్షలతో నిడదవోలు పట్టణ వ్యాప్తంగా సెంట్రల్ విద్యుత్ దీపాలంకరణ, రూ. 45 లక్షలతో తాగునీటి సరఫరా కోసం 2 బోర్‌వెల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ వివరించారు.రూ.30 లక్షలతో చినకాశీరేవు వద్ద భక్తులకు త్రాగునీటి సౌకర్యంతో పాటు స్నానాలకు షవర్స్, రూ.1.25 కోట్లతో పిండ ప్రదానం షెడ్లు, ఘాట్ల ఆధునికీకరణ, రూ.30 లక్షలతో ఫ్లోరింగ్, రివర్ ఫ్రంట్ పార్క్ అభివృద్ధి తదితర పనులు చేస్తున్నామన్నారు. చినకాశీరేవు వద్ద రూ.4.47 కోట్ల రైల్వే నిధులతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా రూ. 3.69 కోట్లతో టూరిజం హబ్ గా నిడదవోలు కేంద్ర ప్రభుత్వ నిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రూ. 3.69 కోట్ల అంచనాతో నిడదవోలు ప్రాంతాన్ని అఖండ గోదావరి ప్రాజెక్టులో అంతర్భాగం చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ముఖ్యంగా చినకాశీరేవులోని 3 ఘాట్లలో పర్యాటక శాఖ ద్వారా శాస్కి స్కీమ్ లో భాగంగా రూ. 24 లక్షలతో దివ్యమైన ‘గోదావరి హారతి’ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శెట్టిపేట వద్ద గోదావరి కెనాల్‌లో బోటింగ్, వే-సైడ్ రెస్టారెంట్, చిన్నారులకు ప్లే జోన్, పచ్చదనంతో కూడిన గ్రీనరీ,లిఫ్ట్ సౌకర్యంతో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. అదే విధంగా శెట్టిపేట వద్ద ‘టూరిజం హరిత రిసార్ట్స్’ ఏర్పాటుతో పాటు చినకాశీరేవులోని పలు దేవాలయాల ఆధునికీకరణ, తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ ఆలయంలో భక్తులకు వసతి సౌకర్యాలతో పాటు అన్నదాన సత్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దూరదృష్టి కలిగిన నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ విశేష భాగస్వామ్యంతో నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని 7 ప్రధాన ఘాట్లతో పాటు ఇరిగేషన్ శాఖతో చర్చించి ఖండవల్లి, మల్లేశ్వరం ఘాట్లను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.. చినకాశీరేవును దివ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా, నిడదవోలును సుందర పర్యాటక నిలయంగా మారుస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అధునాతన సౌకర్యాలతో మోడల్ స్టేషన్‌గా నిడదవోలు రైల్వే జంక్షన్:మంత్రి దుర్గేష్ నిడదవోలు రైల్వే జంక్షన్‌ను ప్రయాణికులకు అత్యాధునిక మౌలిక వసతులతో అందుబాటులోకి తీసుకువస్తున్నందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిడదవోలు రైల్వే స్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫారమ్‌లు మరియు ఇతర ప్రజా సౌకర్యాలను మంత్రి దుర్గేష్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్కలేటర్‌పై ప్రయాణించి స్టేషన్ అంతటా కలియదిరిగి అధికారులతో మాట్లాడారు.నిడదవోలు పట్టణం పరిసర ప్రాంత ప్రజలకు రైల్వే జంక్షన్ అత్యంత కీలకమైన కేంద్రమని పేర్కొన్నారు. మున్సిపాలిటీ ప్రత్యేక చొరవతో రైల్వే స్టేషన్‌కు అనుసంధానంగా ఉన్న అప్రోచ్ రోడ్డు అభివృద్ధి, ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, ఆకర్షణీయమైన సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లతో రైల్వే స్టేషన్ పరిసరాలు పట్టణానికే శోభ తెచ్చేలా మారుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.చుట్టుపక్కల అనేక గ్రామాలు, మండలాల ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిడదవోలు జంక్షన్‌లో ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి ఇప్పటికే రైల్వేశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు.లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ (LTT) ఎక్స్‌ప్రెస్ రైలు నిడదవోలు స్టేషన్‌లో ఆగేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని సెప్టెంబర్ 6వ తేదీన ఈ రైలుకు స్వయంగా జెండా ఊపి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.విజయవాడ – భువనేశ్వర్ మార్గంలో నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలును నిడదవోలులో నిలపడం ఇక్కడి ప్రయాణికులకు అత్యంత ఆవశ్యకమని, దీనిపై రైల్వే శాఖకు ఇప్పటికే అధికారికంగా విజ్ఞప్తి చేశామని, త్వరలోనే సానుకూల నిర్ణయం రానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు మరియు రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.