
హైదరాబాద్: కేపీహెచ్బీ కాలనీ 2వ రోడ్డులోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో నిర్వహించిన గురుపౌర్ణమి మహోత్సవాల్లో కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి ప్రేమ కుమార్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎల్. నాగేశ్వరరావు, ఎల్. రాజా ఆహ్వానం మేరకు హాజరైన ప్రేమ కుమార్ ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సేవలందించారు.
ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు ప్రేమ కుమార్ దంపతులను శాలువాతో సత్కరించారు.
కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, దుత్త శంకర్, సుంకర సాయి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు