
కరీంనగర్: జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ నాయకుడు డా. బండారి రాజ్‌కుమార్ అధ్యక్షతన తొలి పార్లమెంట్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ పాల్గొని పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులతో చర్చించారు.
ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆగస్టు 9న జరగనున్న కరీంనగర్ పార్లమెంట్ సమావేశాన్ని విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుంచి జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పార్టీ సంస్థాగత బలోపేతానికి ఇలాంటి సమన్వయ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయని, గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు జేరిపోతుల సంజీవ్, గంగారపు శ్రీకాంత్, ఏరుగు శ్రీకాంత్, పవన్, మధు తదితరులు పాల్గొన్నారు.