

మంగళగిరి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
అమరావతిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి హాజరయ్యే ముందు రామ్ చరణ్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఇద్దరూ పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుని వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. రామ్ చరణ్ రాకతో జనసేన కార్యాలయం వద్ద సందడి నెలకొంది.
అమరావతిలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమంలో పాల్గొనే ముందు జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీ రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.