
జనసేన పార్టీ సంస్థాగత విస్తృత నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన ప్రక్రియలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిమగ్నమై ఉన్నారు. పార్టీ నిర్మాణంలో భాగమైన కమిటీల ఏర్పాటుకి సంబంధించి గత కొన్ని నెలలుగా పార్టీలోని ముఖ్యులను ఆయన సంప్రదిస్తూనే ఉన్నారు. శస్త్ర చికిత్స అనంతరం స్వస్థత చేకూరకపోయినా, ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నా ఈ ప్రక్రియ పూర్తి చేయడం మీద దృష్టిపెట్టారు. ప్రస్తుతం ఉన్న పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, 175 నియోజకవర్గాల ఇంఛార్జుల నియామకాలను వచ్చే రెండు మూడు రోజులలో ప్రకటించనున్నారు. ఇప్పటి వరకూ బాధ్యతలు నిర్వహించిన తీరు, ఇటీవల చేపట్టిన సభ్యత్వ నమోదులో చూపిన చొరవ ఆధారంగా ఈ నియామకాలు ఉండబోతున్నాయి.