
గుంతకల్లు నియోజకవర్గం: గుత్తి మండలం సూరసింగనపల్లి గ్రామంలో 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే శ్రీశ్రీశ్రీ అంకాలమ్మ ఊరు జాతర సందర్భంగా గ్రామ ప్రజలు మరియు కూటమి నాయకుల ఆత్మీయ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా వాసగిరి మణికంఠ పాల్గొన్నారు. అనంతరం ఆయనకు శ్రేయోభిలాషులు శాల్వాలు కప్పి, పూల హారాలు వేసి ఘన స్వాగతం పలికారు.
ఈ పవిత్రమైన మహోత్సవం సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ అంకాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకొన్నారు…
ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ జనసేన అధ్యక్షుడు మరియు మాముడూరు సింగల్ విండో ప్రెసిడెంట్ పాటిల్ సురేష్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు గోరంట్ల నాగయ్య రాయల్, వెంకటపతి నాయుడు జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, సుంకర నాగరాజు, అమర్, రవి కూటమి నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.