పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం జాపాలి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

తిరుమల: ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్స అనంతరం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలోకి రావాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులు తిరుమల జాపాలి ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించారు.

మంగళవారం ఈ సందర్భంగా జనసేన నాయకులు జీవన్, మంజు భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ మొక్కుల్లో భాగంగా అభిషేకం, హోమం నిర్వహించి 116 కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేశారు.

పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని దేవుని ఆశీర్వాదం కోరుకున్నారు. ఈ కార్యక్రమం భక్తి వాతావరణంలో జరిగింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.