

శస్త్రచికిత్స జరిగి బయటకు రాలేని పరిస్థితిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు గారి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోతున్నానని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధను వ్యక్తం చేశారు. శ్రీ భాస్కరరావు గారి కుమారుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ భాస్కరరావు గారి మృతికి సంతాపం వ్యక్తం చేశారు.