పవన్ కళ్యాణ్ కోసం అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

పర్చూరు నియోజకవర్గం: చిన్నగంజాం మండలం పరిధిలోని సోపిరాల గ్రామంలో హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జనసేన నాయకులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని ప్రార్థించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి తుమ్మలపెంట సతీష్, సీనియర్ నాయకులు డా. సుబ్బారావు, సందు రాము, ప్రధాన కార్యదర్శి కుర్రి వాసు, నరహరి గోపి, పులా విజయ్, లక్ష్మణ్, రాకేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.