

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వితంతువులకు ప్రభుత్వం పెద్ద శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.53 లక్షల మంది వితంతువులకు ప్రతి నెల ₹4,000 పింఛన్ అందించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ కొత్త పింఛన్లు జూన్ 2025 నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది. ఇప్పటికే “Spouse Category” ద్వారా సుమారు 2.30 లక్షల మందికి లాభం చేకూరుతోంది.
తదుపరి దశలో దివ్యాంగులకు కూడా కొత్త పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
మొత్తంగా చూస్తే సుమారు 10 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రతి నెల సుమారు ₹400 కోట్లు ఖర్చు చేయనుంది.
అర్హత ఉన్న వారు తప్పకుండా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.