ప్రకాశం జిల్లా: సింగరాయకొండ మండలానికి చెందిన ఒక దివ్యాంగుడు తనకు ఇంటి స్థలం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి విన్నపం చేశారు.
సన్నబోయిన నాగేశ్వరరావు అనే దివ్యాంగుడు తన తండ్రి సన్నబోయిన పెదమాలకొండయ్య అని పేర్కొంటూ, ఇప్పటివరకు తనకు సొంతంగా ఎటువంటి స్థలం లేదా ఇల్లు లేవని తెలిపారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసిస్తున్నానని, తనకు ఇంటి స్థలం కేటాయించి సహాయం చేయాలని ఆయన కోరారు.
తాను నిరుపేద కుటుంబానికి చెందినవాడినని, ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పింఛనుపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం దయచేసి తన పరిస్థితిని అర్థం చేసుకుని సహాయం చేస్తే, తన మండల పరిధిలోనే ఒక ఇల్లు నిర్మించుకుని స్వావలంబనతో జీవించగలనని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేస్తుందనే విశ్వాసంతో ఈ విన్నపాన్ని సమర్పిస్తున్నట్లు తెలిపారు.