మార్కాపురంలో మెగా జాబ్ మేళా – యువతకు ఉద్యోగ అవకాశాలపై దృష్టి

మార్కాపురం నియోజకవర్గం: మార్కాపురం పట్టణంలోని బి కన్వెన్షన్‌లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలు యువతకు మంచి వేదికగా మారాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్ మేళాలకు భారీ స్పందన రావడం హర్షణీయమని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ప్రణాళికాబద్ధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. వివిధ సాఫ్ట్‌వేర్ మరియు ఎంఎన్‌సీ కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్నాయని, యువత వాటిని ఉపయోగించుకోవాలని కోరారు.

అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో భాగంగా కలెక్టర్, ఎమ్మెల్యే కలిసి కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి కంచిబాబు, తెదేపా, భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.