స్టాండప్ కామెడీ వివాదం: అనుదీప్‌పై చర్యలకు జనసేన డిమాండ్

  1. వ్యక్తిత్వ హణనానికి పాల్పడితే ఎవరినైనా సహించేది లేదు
  2. స్టాండప్ కామెడీ అంటే నవ్వించటం… కొందరి జీవితాల్ని ఏడిపించటం కాదు
  3. మహిళల గౌరవాన్ని అవమానించటం సామాజిక నేరంగా పరిగణించాలి
  4. మెగాభిమానుల, జనసైనికుల సహనానికి ఒక హద్దు ఉంటుంది
  5. జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రఖ్యాత నటులు రామ్ చరణ్, నిహారికల వ్యక్తిగత జీవితాలను స్టాండప్ కామెడీ పేరిట కించపరుస్తూ కటికాల అనుదీప్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ అతనిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ను అయన కార్యాలయంలో జిల్లా జనసేన అధికార ప్రాతినిది ఆళ్ళ హరి కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా అనుదీప్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆళ్ళ హరి ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఎస్పీ స్పందిస్తూ అనుదీప్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించ్చారు. ఈ సందర్బంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ప్రముఖుల, రాజకీయ నాయకుల, సినీ నటుల జీవితాల్లోకి తొంగిచుస్తూ వారి వ్యక్తిత్వాన్ని హననం చేయటం కొంతమందికి ఒక ఫ్యాషన్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యక్తిత్వ హణనానికి పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదన్నారు. ఈ విష సంస్కృతిని ఎప్పటికప్పుడు నివారించకపోతే సమాజంలో అలజడులు మొదలయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసారు. స్టాండప్ కామెడీ అంటే నవ్వించాలి కానీ కొందరి జీవితాలను ఏడిపించటం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడి వారి గౌరవాన్ని అవమానించటాన్ని సామాజిక నేరంగా పరిగణలోకి తీసుకోవాలన్నారు.

సమాజంలో తమకు గుర్తింపు రావటం కోసం కొంతమంది చీడపురుగులు మెగాఫ్యామిలీ టార్గెట్ గా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మెగాభిమానుల, జనసైనికుల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని, మరోసారి ఎవరన్నా హద్దు మీరితే పరిస్థితులు మరోలా ఉంటాయాని ఆళ్ళ హరి హెచ్చరించ్చారు. ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన వారిలో నగర జనసేన కార్యదర్శి షేక్ మెహబూబ్ బాషా, కోలా అంజి, వడ్డె సుబ్బారావు, నండూరి స్వామి తదితరులున్నారు

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.