సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై జనసేన నేతల ఆగ్రహం

నరసాపురం: జనసేన పార్టీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని మండల వైస్ ప్రెసిడెంట్ గన్నాబత్తుల దుర్గాప్రసాద్ ఆరోపించారు. “నడిరోడ్డు పై జై జనసేన అంటూ యువకుడు వీరంగం” అనే శీర్షికతో తెలుగు స్క్రైబ్ ఫేస్‌బుక్ ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో చూపిన వ్యక్తిని జనసేన పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్‌గా పేర్కొనడం పూర్తిగా అసత్యమని తెలిపారు.

ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తికి జనసేన పార్టీతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా బుడితి సుమన్ అనే వ్యక్తి ఈ వీడియోకు తప్పుడు ట్యాగ్ లైన్ జోడించి సోషల్ మీడియాలో వైరల్ చేయడంలో పాత్ర వహించారని పేర్కొన్నారు.

ఈ ఘటనపై సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఫిర్యాదును జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వాతాడి కనకరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి బందెల రవీంద్ర, బిసి సెల్ అధ్యక్షులు వాతాడి రమేష్, వీరమహిళ పాకెర్ల రోజ, అడ్వకేట్ కొక్కిరిగడ్డ అమర్, అడబాల నాని, మాధుం వాసు, బోనం వాసు, బాసిన కోటి, అడబాల ప్రసాద్, నల్లి బుల్లి రాజు, పొన్నమండ యుగంధర్ తదితరులు సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.