

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. గతంలో 24వ స్థానంలో ఉన్న ఈ శాఖ, అగ్రస్థానానికి చేరింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల పనితీరు వంటి విభాగాల్లో ప్రత్యేక కృషికి ఐదు జాతీయ అవార్డులు పొందినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది.
ఈ కృషి ద్వారా రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ మరింత బలపడినట్లు, ప్రజలకు సేవలు మరింత సులభంగా చేరుతున్నాయని అధికారులు తెలిపారు. అవార్డులు కేంద్ర ప్రభుత్వం నుంచి కేం తి గుర్తింపు కాబట్టి, పంచాయతీరాజ్ శాఖకు ఇది ప్రత్యేక సత్కారం.