మార్కాపురం ప్రమాద బాధితులకు జనసేన భరోసా

– ₹50,000 తక్షణ ఆర్థిక సాయం

నెల్లూరు: మార్కాపురం బస్సు అగ్ని ప్రమాదంలో మృతి చెందిన జనసేన మద్దతుదారులు, కలిగిరి మండలం నాగసముద్రం పంచాయితీకి చెందిన ఆత్మకూరు చిన్నయ్య మృతి పట్ల జనసేన పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.జనసేన నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాల మేరకు, మృతుని కుటుంబానికి ₹50,000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఐదుగురు ఆడబిడ్డలు కలిగిన చిన్నయ్య కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు సహాయం అందిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి శాశ్వత ఉపాధి కల్పించే దిశగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో సంప్రదిస్తామని వేములపాటి అజయ్ తెలిపారు.ఏ చిన్న కార్యకర్తకు కష్టం వచ్చినా తోడుండటమే జనసేన లక్ష్యమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉదయగిరి నాయకులు కాశి రావు జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, జిల్లా కార్యాలయం ఇన్చార్జ్ జమీర్, పప్పు నారాయణ, షాజహన్, కావలి నాయకులు వెంకటసుబ్బయ్య, జానీ, జిల్లా సంయుక్త కార్యదర్శి మడపర్తి ప్రశాంత్ గౌడ్, నెల్లూరు నగర కార్యదర్శి జొన్నలగడ్డ హేమచంద్ర యాదవ్, కలిగిరి బండారు లక్ష్మీనారాయణ, వింజమూరు సత్యనారాయణ, నరేష్, గువ్వల వెంకీ, సురేషు, కాకుటూరు రాఘవేంద్ర, తిప్పినేని రమేష్, తేలపోలు రమేష్, గుండాబత్తిన రామ్మూర్తి, మల్యాద్రి రెడ్డి, మదన్ కుమార్ యాదవ్, దుత్తలూరు నాయకులు మహేష్, ఆత్మకూరు అక్బర్, బాషా, శ్రీనివాసులు, దుంపర్లపాడు భాను, షమ్మీ, ముద్రకొలను శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.