ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయం దేశ ప్రజలకు ఊరటనిస్తుంది

• పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించినందుకు ధన్యవాదాలు
• కష్టకాలంలో ప్రజలపై ఇంధన భారం పడకుండా నిర్ణయం తీసుకున్నారు

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అనుక్షణం దేశ ప్రజల క్షేమం కోరుకునే నాయకుడని మరోసారి నిరూపించుకున్నారని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో కొనియాడారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ ప్రజలకు అండగా ఉంటామని చాటుకుంటున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ ప్రజలపై పడకుండా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించి ఇంధన భారం నుంచి ఊరట కల్పించారు. ప్రపంచం మొత్తం ఇంధన సంక్షోభంలో చిక్కుకున్న వేళ శ్రీ నరేంద్ర మోదీ గారు తన దౌత్య నీతితో ఆ ప్రభావం మనపై పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంధన కొరత రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూనే.. ప్రజలపై భారం పడకుండా తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 10 తగ్గించడంతోపాటు డీజిల్ పై ఉన్న సుంకాన్ని పూర్తిగా రద్దు చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం దేశ ప్రజలతోపాటు చమురు సంస్థలకు కూడా ఊరటనిస్తుందని శ్రీ పవన్ కళ్యాణ్ వివరించారు.

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నిర్ణయం దేశ ప్రజలకి ఊరటనిస్తుంది

• పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించినందుకు ధన్యవాదాలు

• కష్టకాలంలో ప్రజలపై ఇంధన భారం పడకుండా నిర్ణయం తీసుకున్నారు

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అనుక్షణం దేశ ప్రజల క్షేమం కోరుకునే నాయకుడని మరోసారి నిరూపించుకున్నారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ ప్రజలకు అండగా ఉంటామని చాటుకుంటున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ ప్రజలపై పడకుండా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించి ఇంధన భారం నుంచి ఊరట కల్పించారు. ప్రపంచం మొత్తం ఇంధన సంక్షోభంలో చిక్కుకున్న వేళ శ్రీ నరేంద్ర మోదీ గారు తన దౌత్య నీతితో ఆ ప్రభావం మనపై పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంధన కొరత రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూనే.. ప్రజలపై భారం పడకుండా తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 10 తగ్గించడంతోపాటు డీజిల్ పై ఉన్న సుంకాన్ని పూర్తిగా రద్దు చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం దేశ ప్రజలతోపాటు చమురు సంస్థలకు కూడా ఊరటనిస్తుంది.

(పవన్ కళ్యాణ్)

ఉప ముఖ్యమంత్రి

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.