

*దీని వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షించాలి
హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకొనే శ్రీరామ నవమి రోజున, ఆకివీడులో రామాలయానికి పూజలో పాల్గొనేందుకు వెళ్లిన గౌరవ శాసనసభ ఉప సభాపతి శ్రీ రఘురామకృష్ణరాజు గారిపై, ఆయన అనుచరులపై, జనసేన నాయకులపై కొంతమంది వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పోస్టు చేశారు. పండుగ రోజు, ఆలయం దగ్గర ఈ దాడి జరగడం వెనుక కుట్ర కోణం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, దాడి వెనుక ఎవరున్నారో విచారణ జరిపి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలి అని పోలీస్ శాఖకు సూచిస్తున్నాను. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.