బంగారమ్మ దేవి ఆలయ నూతన గోపుర కలశ ప్రతిష్టాపనకు ఆహ్వానం

మంత్రాలయం: కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం, నందవరం మండలం నందవరం గ్రామంలో ఏప్రిల్ 2వ తేదీన మాత బంగారమ్మ దేవి దేవాలయం నూతన గోపుర కలశం, ముఖద్వారం ప్రతిష్టాపన కార్యక్రమం మరియు వాల్మీకి మహర్షి విగ్రహానికి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడనున్నాయి.

ఈ కార్యక్రమాలకు రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రాలయం జనసేన పార్టీ ఇన్చార్జి వాల్మీకి బి లక్ష్మన్నను మంత్రాలయం టౌన్‌లో కలసి నందవరం గ్రామ వాల్మీకి ముఖ్య నాయకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎన్ లింగమూర్తి, దేవుళ్ల పెద్ద రామన్న, ఈ తిమ్మరాజు, భీమ శేఖర, డి నాగరాజు, టీ పాండు, రాజు, ఆర్ గజేంద్రనాయుడు, పి నాగరాజు, జి నారాయణ, సి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

పూజా కార్యక్రమాలు ఉదయం 7:05 నుంచి 10:05 వరకు పూర్ణాహుతితో కొనసాగి, అనంతరం తీర్థ ప్రసాదం పంపిణీ జరుగుతుంది. మధ్యాహ్నం 1:00 గంటలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడుతుంది.

కాబట్టి గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై ఈ పూజా కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో నందవరం గ్రామ వాల్మీకి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.