
• పార్టీ పతాక ఆవిష్కరణ… సేవా కార్యక్రమాల నిర్వహణకు పిలుపు
మార్చి 14… జన సైనికులకి, వీర మహిళలకు, జనసేన నాయకులకు పండగ లాంటి రోజు. ఈ దఫా జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఉమ్మడి జిల్లా, నగర, మండల కేంద్రాలు, పంచాయతీల్లో నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఆ రోజు అన్ని జిల్లా, నగర, మండల కేంద్రాలు, పంచాయతీల్లో జనసేన పార్టీ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పార్టీ పతాకాన్ని- జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, ఉద్యమి సభ్యత్వం పొందినవారి సమక్షంలో ఎగురవేస్తారు. సైద్ధాంతిక బలంతో, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఏ విధంగా ముందుకు వెళ్తుందో పార్టీ శ్రేణులకు, ప్రజలకు వివరిస్తారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రక్త దాన శిబిరాలు, ఆహార వితరణ, పర్యావరణ సంబంధిత కార్యక్రమాల్లాంటివి చేపట్టాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు.
• ఎండల తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం మార్పు
ఈ దఫా జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర స్థాయిలో పిఠాపురంలో నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయనే రిపోర్టులను పరిగణనలోకి తీసుకొన్నారు. అందుకు అనుగుణంగా వేడుకల నిర్వహణ స్వరూపాన్ని మార్చారు. ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా కాకుండా జిల్లా, సిటీ, మండల కేంద్రాల్లో నిర్వహించి కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహాన్ని కొనసాగించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడికక్కడ స్థానికంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.