విజయవాడ, వర్షం వల్ల ముంపుకు గురైన 42వ డివిజన్లో హౌసింగ్ బోర్డ్ కాలనీలో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ మరియు 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష పర్యటించడం జరిగింది . స్థానిక ప్రజలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, చిన్న వర్షం పడితే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని దాని వళ్ళ ఇంట్లో సామాన్లు అన్ని పాడైపోతున్నాయి వారి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు గురించి సమందిత అధికారులతో మాట్లాడడి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో స్థానిక జనసేన పార్టీ నాయకులు అయాజ్, మహేశ్వరి, తులసి మురళి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.