తుపాను నష్టం అంచనాలకు అందడం లేదు

• ముఖ్య మంత్రి బటన్ నొక్కి రైతుల్ని ఆదుకోవాలి
• ప్రతి అడుగులో ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడుతోంది
• నాలుగేళ్లుగా పంట కాలువలు మరమ్మతులు చేయకుండా మాయ చేశారు
• ప్రతి గింజ కొనే వరకు జనసేన – టీడీపీ పోరాటం
• తెనాలి నియోజకవర్గంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన శ్రీ నాదెండ్ల మనోహర్

రైతు కన్నీరు కదిలిస్తోంది .. తుపాను నష్టం అంచనాలకు అందకుండా ఉంది .. ప్రతి అడుగులో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చి నట్టు కనబడుతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. నిర్లక్ష్యాన్ని వదిలి ప్రభుత్వం కచ్చితంగా రైతాంగాన్ని ఆదుకోవాలి అన్నారు. ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి బటన్ నొక్కాలని డిమాండ్ చేశారు. తక్షణ సాయం కింద ప్రతి రైతుకీ రూ. 20 వేల ఆర్ధిక సాయం అందించాలన్నారు. రైతుల ఆవేదన చూసి వారిని ఆదుకోవాలని కోరారు. బుధవారం తెనాలి నియోజకవర్గం పరిధిలోని కొల్లిపర, తెనాలి రూరల్ మండలాల్లో మిగ్ జాం తుపాను కారణంగా నష్టపోయిన పంట పొలాలను టీడీపీ నేత శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్తో కలసి పరిశీలించారు. అయితా నగరం, చక్రాయపాలెం , బుర్రిపాలెం , చదలవాడ, చెముడుపాడు తదితర గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన పంటలను పరిశీలించారు. నీటిలో ఉన్న ఓదెలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి చోట అన్న దాతను పలుకరిస్తూ నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పొలాల్లో నిలచిన నీటిని ఇంజన్లతో తోడుకుంటున్న రైతులతో మాట్లాడారు. ప్రతి చోటా పొలాల మధ్యకు వెళ్లి మురుగు కాల్వవ్యవస్థను పరిశీలించారు. అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ “రైతు కష్టాల్లో ఉన్నాడు. ఉత్తుత్తి బటన్లు నొక్కి మోసం చేయడం కాదు.. రైతులను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి. తూతూ మంత్రంగా రూ. 2 కోట్లు ఇచ్చామంటే అది దేనికి సరిపోతుందితుంద. బాపట్ల, గుంటూరు జిల్లాల్లో సుమారు రూ. 1800 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది . ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. కాలువలు మరమ్మతులు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. నాలుగేళ్లుగా కాలువలు మరమ్మతులు చేపట్టకుండా మాయమాటలు చెప్పి గడిపేశారు. ఏ మండలానికి వెళ్లినా రైతులు కాలువల మరమ్మతులు చేయలేదని చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆవేదన, బాధ చూసి ప్రభుత్వంలో ఉన్నవారు చలించాలి. పరిస్థితులు చక్కబడిన తర్వాత ప్రతి గింజా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసు కోవా లి. ప్రతి గిం జా కొనుగోలు చేసే వరకు జనసేన – టీడీపీ కలసి రాష్ట్ర వ్యా ప్తం గా ఉద్య మిస్తాం . రైతుల పక్షా న నిలబడతాం . ప్రభుత్వం స్పందించాలి. ఆర్ధిక సాయం అందించాలి. పండిన పంటను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయాలి” అన్నారు.
• పంట నష్టం లెక్కల్లో తేల్చలేనటు వంటిది : శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్
తెనా లి నియోకవర్గ టీడీపీ ఇంఛార్జ్ శ్రీ ఆలపాటి రాజేం ద్రప్రసాద్ గారు మాట్లాడుతూ.. “తుపాను కారణంగా ఉమ్మడి గుం టూరు జిల్లా లో రైతులకు జరిగి న నష్టం లెక్కల్లో తే ల్చ లేనటు వంటిది . రాష్ట్ర వ్యా ప్తం గా వ్య వసాయ రంగం అతలాకుతలం అయి పోయింది . ప్రభుత్వ మే ఈ నష్టానికి మూలకారణం. నీరు పొలాల్లో నిలిచి పోవడమే నష్టానికి కారణం. మురుగు కాలువలు బాగు చేసి ఉంటే ఈ పరిస్థి తి వచ్చేది కాదు. రైతు ఎంత నష్టపోతే అంతా చెల ్లిం చాలి. తదుపరి పంటకు 100 శాతం సబ్ సిడీతో విత్తనా లు అందిం చాలి. బూటకపు అంచనా లు వేయకుం డా పూర్తి పరిహారం ఇవ్వాలి” అన్నారు. కార్య క్రమంలో తెనా లి నియోజకవర్గా నికి చెంది న ఇరు పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.