వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో సామాజిక అన్యాయం
జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు, ప్రశ్నిస్తే కేసులు
ఎక్కువయ్యాయి. అమర్నాథ్ గౌడ్ అనే 14 ఏళ్ల బాలుడ్ని కిరాతకంగా చంపి
బెయిల్ పై బయటకు వచ్చిన వారికి ఊరేగింపులు చేస్తున్నారు. స్థానిక సంస్థల
ఎన్నికల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు వైసీపీ తొలగించింది. దాదాపు
16 వేల మందికి పైగా బీసీలు రాజ్యాధికారానికి దూరమయ్యారు. ఎస్సీలను
వెంటాడి, వేధించి మరీ హత్యలు చేస్తున్నారు. డాక్టర్ సుధాకర్ గారి మరణం
నుంచి మొదలు పెడితే ఎస్సీ యువకుడు శ్రీ సుబ్రహ్మణ్యంను హత్య చేసి
డోర్ డెలివరీ చేసే వరకూ వైసీపీ వాళ్లు వెళ్ళిపోయారు. ఇస్లాంలో ఆత్మహత్య
చేసుకోవడం మహాపాపంగా భావిస్తారు. అలాంటిది వైసీపీ దాష్టీకాలకు
భయపడి నంద్యాలలో శ్రీ సలామ్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే
చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకుల చేష్టలకు మిస్బా అనే బాలిక ఆత్మహత్యకు
పాల్పడింది. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. లక్షల
ఎకరాల్లో పంట నష్టం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ చేతకానితనం
వల్ల సాగు నీరు సకాలంలో అందడం లేదు. ప్రాజెక్టుల నిర్వహణ గాలికొదిలేశారు. కనీసం కాలువల్లో నాచు కూడా తీసిన పాపాన పోలేదు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో
స్థానంలో ఉంటే, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రకరకాల పన్నులు వేశారు. ఒక్క పరిశ్రమ రాలేదు. ఒక్కరికి కూడా ఉద్యోగం, ఉపాధి
చూపలేకపోయారు. రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు వలసలు పెరిగిపోయాయి. 44 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ ను అక్రమ కేసుల విషయంలో శ్రీ చంద్రబాబు గారు ఎదుర్కొంటున్నారు.
30 రోజుల్లో ముగిసిపోయే రిమాండ్ ను ఎన్నో కారణాలు చూపించి, వ్యవస్థలను చేతుల్లోకి తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు వైసీపీ ప్రభుత్వంపై పోరాడినా వారి గొంతు నొక్కే
ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది.
తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి 100 రోజుల ప్రణాళిక మీద సమావేశంలో చర్చించాం. దీనిలో భాగంగా మొదటిగా ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో
టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తాం. ఆయా జిల్లా వారీగా ప్రధానమైన అంశాలు, సమస్యలపై ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై ఈ సమావేశాల్లో
ఉమ్మడి కార్యాచరణను నాయకులు ప్రకటిస్తారు. ఉమ్మడి మేనిఫెస్టోను తయారు చేసి నవంబర్ 1 తేదీ నుంచి గడప గడపకు ప్రచారం చేసే కార్యక్రమం మొదలుపెడతాం. దీనితో
పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్న రైతుల దీనస్థితిపై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవ పరిస్థితిపై నివేదికను ఇస్తారు. దాని ఆధారంగా
రైతుల పక్షాన ఏ విధంగా పోరాడాలి? వారికి ఎలా అండగా నిలబడాలి అనేది నిర్ణయిస్తాం. సమావేశంలో మూడు తీర్మాలను ఏకగ్రీవంగా ఆమోదించాం. శ్రీ చంద్రబాబు గారి అక్రమ
అరెస్టును నిరసిస్తూ మొదటి తీర్మానం, వైసీపీ అరాచక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ను రక్షించడానికి టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్న అంశం గురించి రెండో తీర్మానం, ఆంధ్రప్రదేశ్
లోని అన్ని వర్గాలకు అభివృద్ది బాటను పరిచే ప్రభుత్వాన్ని తీసుకువస్తామని మూడో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాం. అక్టోబర్ 27వ తేదీన ఓటరు లిస్టు బయటకు వస్తుంది.
దానిపై ఇంటింటికీ వెళ్లి పూర్తిస్థాయిలో ఇరు పార్టీల కార్యకర్తలు విచారిస్తారు. లోపాలుంటే ఎన్నికల సంఘానికి తెలియజేస్తాం. అభివృద్ధి, సంక్షేమం అనేది తెలుగుదేశం- జనసేన పార్టీ
ప్రభుత్వంలో జోడెద్దుల బండి” అని అన్నారు. ఈ సమావేశంలో జనసేన నుంచి పార్టీరాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితోపాటు శ్రీ కందుల దుర్గేశ్, శ్రీ బి.
మహేందర్ రెడ్డి, శ్రీ కొటికలపూడి గోవింద రావు, శ్రీ పాలవలస యశస్వి, శ్రీ బొమ్మిడి నాయకర్, తెలుగు దేశం నుంచి పార్టీ ఏపీ అధ్యక్షుడు శ్రీ అచ్చెన్నాయుడు గారితోపాటు శ్రీ యనమల
రామకృష్ణుడు, శ్రీ పితాని సత్యనారాయణ, శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీమతి తంగిరాల సౌమ్య, శ్రీ నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.