
గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారు విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. 71 యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీకె రామ్మోహన్ నాయుడు గారు పాల్గొన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారు హాజరయ్యారు.