రుషికొండలో రాజమహల్ నిర్మించుకొంటూ క్లాస్వార్ అంటారా?

• పేదవాడికి సెంటు భూమే… ముఖ్యమంత్రి నివాసానికి 9 ఎకరాలు… రూ.451 కోట్లు ఖర్చు
• సీఎం పచ్చదనం చూసేందుకు ప్రహరీ నిర్మించి గడ్డి పెంచడానికి… రూ 21 కోట్లు నిధులు
• పేదల ఇళ్ల కాలనీల్లో కనీస సదుపాయాలు… మౌలిక వసతులు లేవు
• ఇప్పుడు చెప్పండి ఎవరు పెత్తందారు ?
• ప్రపంచంలో ఏ ప్రభుత్వ అధినేతా ఈ విధంగా వ్యవహరిం చలేదు?
• రుషికొండపై టూరిజం ప్రాజెక్ట్ అంటూ బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చారు
• గౌరవ న్యాయస్థానాల అఫిడవిట్లలోనూ అదే చెప్పారు
• అటు బ్యాంకులను మోసం చేస్తూ… కోర్టులకు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారు
• దమ్ముంటే రుషికొండపై నిర్మించేది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అని చెప్పండి
• జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

‘రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు యుద్ధం జరుగుతోందని సభలు, సమావేశాల్లో పదేపదే మాట్లాడుతున్న ముఖ్యమంత్రి… జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణం కోసం పేదవాడికి సెంటు భూమి ఇచ్చి … తనేమో రుషికొండపై 9 ఎకరాల్లో రూ. 451.67 కోట్లతో రాజమహాల్ నిర్మించుకుంటున్నారు ’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు . ఏడు నక్షత్రాల హోటల్ కంటే ఖరీదైన, విలాసవంతమైన భవంతిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు . ఒబెరాయ్ గ్రూపు గండికోటలో ఏడు నక్షత్రాల హోటల్ నిర్మించడానికి రూ. 350 కోట్లు ఖర్చు అంటూ డీపీఆర్ ఇస్తే … ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మాత్రం రూ. 451.67 కోట్ల ఖర్చు చేశారని వెల్లడించారు . ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనంతో భవంతి నిర్మించుకున్న ముఖ్యమంత్రికి పేదలు, పెత్తందార్లు అంటూ మాట్లాడే అర్హతే లేదన్నారు . టూరిజం ప్రాజెక్టు పేరిట కోర్టులు, బ్యాంకులను తప్పుదారి పట్టించిన ఈ ప్రభుత్వం పై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు . రుషికొండపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం చేస్తున్న ఖర్చు.. విలాసవంతమైన ఏర్పాట్లపై సోమవారం వీడియో సందేశం ఇచ్చారు . ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “విశాఖపట్నంలోని రుషికొండపై రూ. 108.30 కోట్ల అంచనాతో టూరిజం ప్రాజెక్టు నిర్మిస్తున్నా మని చెప్పిన పర్యాటక శాఖ… కోర్టులు, బ్యాంకులను తప్పుదోవ పట్టించి గుట్టు చప్పుడు కాకుండా రూ. 451.67 కోట్లు వెచ్చించి ముఖ్యమంత్రి కోసం కార్యాలయం, నివాస భవనాలను నిర్మించింది. ప్రపంచంలో ఏ దేశ అధినేత కూడా నివాస భవనాల కోసం ఇంతలా ప్రజాధనాన్ని వెచ్చించలేదు. ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్తలా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి తన విలాసాల కోసం ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం ఏమిటి? ఓ మంత్రిగారు రెండు రోజులనాడు కూడా అక్కడ కట్టేది టూరిజంరిసార్ట్ అంటున్నారు . ఆయనే చెబుతున్నారు గండికోట దగ్గర ఒబెరాయ్ గ్రూప్సె వెన్ స్టార్ హోటల్ నిర్మిస్తుందని. ప్రపంచంలో ఉన్నవే మూడో నాలుగో 7స్టార్ హోటల్స్ . గండికోటలో వస్తుందని చెప్పారు . ఆ హోటల్ డీపీఆర్ చూస్తే రూ.350 కోట్ల ఖర్చు అని ఉంది. రుషికొండ ప్యాలెస్కి మాత్రం రూ.451.67 కోట్లు అంటే ఏమిటి?
• మత్స ్యకారులు కూడా అటుపోరాదురు
షికొండపై టూరిజం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని రూ. 140 కోట్లు బ్యాంకుల నుంచి రుణం తీసుకొ చ్చారు . 750 ఎగ్జిక్యూ టివ్ ఛైర్స్ , 100 సోఫా సెట్లు కొనుగోలు చేశారు . పడకలు 20 మాత్రమే కొన్నారు . నిజంగా ఈ ప్రాం తంలో రి సార్టులే నిర్మిస్తే 20 పడకలతో గదులు ఏ మూలకు సరి పోతాయి? ఇది ముమ్మా టికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యా లయం కోసం కొ న్న ఫర్నే చరే . ఇదంతా బయటకు తెలుస్తు న్నా ఇంకా బ్యాం కులను మోసం చేయడానికి అధికారు లు ప్రయత్ నిస్తు న్నారు . రెండు రోజుల క్రితం కూడా సంబంధిత మంత్రి టూరి జం ప్రాజెక్టు అని మాట్లాడారు . జరు గుతున్న పను లు కొను గోలు చేస్తు న్న ఫర్ నిచర్ చూస్తుం టే మాత్రం అందుకు విరు ద్ధం గా కనిపిస్తు న్నా యి. ఇంత జరు గుతున్నా ఇప్ప టికీ కూడా రి షికొం డపై నిర్మిస్తుం ది ముఖ్యమంత్రి క్యాంపు కార్యా లయం అని దమ్ము , ధైర్యంతో చెప్ప లేకపోతున్నారు . ఇంత పె ద్ద రి సార్టులో 20 రూములే కడితే ఎప్ప టికి రె వెన్యూ జనరే ట్ చేయగలుగుతారో ప్రజలకు పర్యా టక శాఖ అధికారు లు వివరించా లి. రు షికొం డ నిర్మా ణాలపై నా లుగేళ్ల నుం చి రచ్చ నడుస్తోం ది. పర్యా వరణానికి తీవ్ర విధ్వం సం జరు గుతుం దని ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. మా జనసే న నా యకులు అక్కడి పర్యా వరణ విధ్వం సంపై న్యా యస్ థానా ల్లో పి టీషన్ లు వేశారు . కొం తమంది జనసే న నా యకులపై కేసులు కూడా నమోదయ్యా యి. విశాఖ పర్యటనలో ఉండగా మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యా ణ్ గారు రెండుసార్లు రు షికొం డపై నిర్మా ణాలను పరి శీలిద్దా మని వెళ్తే వేలాది మంది పోలీసులతో అడ్డు కున్నారు . రహదారు లపై బారి కేడ్ లు పెట్టి నిర్భందించారు . నిజానికి అక్కడ కడుతున్న ది టూరి జం ప్రాజెక్టు అయితే ఇన్ ని నిబంధనలు ఎందుకు? చివరకు మత్స ్యకార సోదరు లు కూడా అటువైపు పోకూడదనీ, జీపీఎస్ పెట్టు కోవాలని నిబంధనలు పె ట్టారు .
• జగన్ బాగోతాలు ఒక్కొకటిగా బయటకు వస్తున్నాయి
ప్రజలను మోసగింగ్ెంచడానికి, అవినీతి కప్పిపుచ్ చుకునేం దుకు వైసీపీ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించిం ది. ప్రభుత్వ ఉత్తర్వు లను ఆన్ లైన్ లో ఉంచకుం డా దాచి పెట్టిం ది. దీనిపై గౌరవ హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వు లను ఆన్ లైన్ లో పె ట్టాలని ఆదేశిం చడంతో ప్రభుత్వ అవినీతి, జగన్ బా గోతం ఒక్కొ క్కటిగా బయటకు వస్తు న్నా యి. దొం గ జీవోల ద్వా రా క్యాంపు కార్యా లయం నిర్మా ణానికి వందల కోట్ లు విడుదల చేయడం కూడా హైకోర్టు చొరవతో నే బయటపడిం ది. ఇందుకుగానూ ముం దుగా గౌరవ హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపు తున్నాను . ఈ అవినీతిలో భాగమైన ప్రతి ఒక్కరి పై ప్రభుత్వం మారి న తరు వాత చర్యలు తీసుకుంటామని అన్నారు .

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.